Oct 04,2023 22:51

ప్రజాశక్తి-గన్నవరం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు, రిమాండ్‌ను నిరసిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరంలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న కక్షపురితమైన చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష 22వ రోజు కొనసాగింది. బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రేమల్లె,కొత్తపల్లి, ఆరుగొలను, తిప్పనగుంట, రంగన్నగూడెం గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్ష లో పాల్గొన్నారు. వీరికి సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నేత,ఆళ్ళ వెంకట గోపాలకష్ణారావు, బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్‌, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ళ సూర్యం, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరు సాయి కళ్యాణి, మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ అధికార ప్రతినిధి వడ్డెళ్ళి లక్ష్మీకుమారి, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు మొవ్వ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.