May 04,2023 00:27

నిరసన చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి -అనంతగిరి: గత ఐదేళ్లు క్రితం మంజూరైన రోడ్డు పనులను పారెస్టు అధికారుల అభ్యంతరాలతో నిలిచి పోయిందని గిజనులు చేతులు జోడించి వినుత్నంగా నిరసన చేపట్టారు. అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయతీ శంకుపర్తి మీదుగా గాలిపాడు, శతబి, మెటువలస రోడ్డు పనులకు అటవీ శాఖ అడ్డంకులు తొలగించి రహదారి పనులను పూర్తి చేయండి మహాప్రభో అంటూ స్థానిక సర్పంచ్‌ పాగి. అప్పారావు నేతృతంలో స్థానిక గిరిజనులు మోకాళ్లపై వినూత్నంగా బుధవారం నిరసన చేపట్టారు. ఎట్టకేలకు రహదారి పనులు చేయాలని అధికారులు చెప్పడంతో రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించగా ఫారెస్ట్‌ అధికారులు అనుమతులు లేవని సరికాదన్నారు. గుమ్మకోట నుంచి శంకుపర్తి, శతాభి, గాలిపాడు, మెట్టువలస గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని గిరిజనులు తెలిపారు.