అమ్మవారి చిత్రపటాన్ని ఇస్తున్న సభ్యులు
ప్రజాశక్తి-పాడేరు: పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మల్లె శివ నాగరాజు కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చిన మల్లె శివ నాగరాజు కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్ధ ప్రసాదాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రమణ్యం శర్మ అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి మనంగా సత్కరించారు.










