అమ్మవారిని దర్శించుకున్న డిఇఒ దంపతులు
ప్రజాశక్తి-పాడేరుటౌన్:స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మైదాన ప్రాంతానికి చెందిన వంద లాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికీ బారులు తీరారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కులు బడులు ఉన్న కొంత మంది భక్తులు వంటలు చేసుకోగా, మరి కొంత మంది ఆయ ప్రాంగణంలో బివిఎస్ ముకుందరావు, సిద్ధినాతి కొండలరావు, కొట్టగుళి రామారావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డిఇఒ దంపతులను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.










