ప్రజాశక్తి - కాకినాడ
మోడీని గదింపండి దేశాన్ని కాపాడండి అని నినాదంతో సిపిఐ, సిపిఎం ప్రచార బేరి కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట ఏరియాలో నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న మోడీ బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే పని చేస్తుందన్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతుందన్నారు. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలగా మార్చే విధంగా 44 కార్మిక చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఇవి చాలా దారుణమని అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటు వ్యక్తులకు ధారాధత్వం చేసే విధంగా నిర్ణయాలు చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని అన్నారు. విద్యుత్ సవరణ చట్టం పేరుతో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని, మోడీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దీనివల్ల కష్టజీవులు కార్మిక వర్గం కష్టాల పాలు అవుతున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకపోయినా అధికార పక్షం ప్రతిపక్షం కూడా ప్రశ్నించకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే సిపిఎం, సిపిఐ ప్రచార కార్యక్రమం చేపడుతున్నాయని ప్రజలందరూ ఈ విషయాలు గమనించి రాబోయే కాలంలో ఆలోచించి కష్టజీవుల విధానాలు, కార్మికుల విధానాలు అమలు చేసే వ్యక్తులను ఎన్నుకోవాల న్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డి.శేష బాబ్జి, సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, మలకా వెంకటరమణ, రొంగల ఈశ్వరరావు, రాంప్రసాద్ మొదలైన వారు పాల్గొన్నారు.
ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
ప్రజాశక్తి -కరప
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిర్వీరం చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం బిజెపి అవలంభిస్తుందని జిల్లా సిపిఎం నాయకురాలు ఎం.రమణి అన్నారు. బుధవారం కరప గ్రామంలో వామపక్షాల ప్రచార భేరిలో భాగంగా ఉపాధి కూలీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలనలో రాష్ట్రానికి ఉపాధి హామీకిచ్చే నిధులను ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్లో రూ.90 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.60 వేలు కోట్లు మాత్రమే కేటాయిం చారన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు ప్రయత్నాలు చేస్తోందని ఈ విధానాలను ఐక్యంగా అందరూ వ్యతిరేకించాలని రమణి అన్నారు. అనంతరం ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనం పుదాం దేశాన్ని కాపాడు కుందాం అనే నినాదంతో వామపక్షాలు ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుమారి, వెంకటలక్ష్మి, ఆశ, ప్రసాద్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
కాకినాడ దుమ్ములపేటలో ప్రచార బేరి నిర్వహిస్తున్న సిపిఐ సిపిఎం నాయకులు










