మోడీని గద్దె దించి దేశాన్ని రక్షించుకుందాం - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ
కడప :దేశాన్ని రక్షించుకోవాలంటే నరేంద్ర మోడీని గద్దె దించాలని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడు కునేందుకు ప్రతి పౌరుడు నడుం బిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, జాతీయ కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్జీస్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ చేపట్టిన సిపిఐ ప్రచార బస్సు యాత్ర బుధవారం రాత్రి కడపకు చేరుకుంది. ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. దేశాన్ని కాపాడుకోవాలంటే లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు కలవాలన్నారు. దేశంలోని దాదాపు 20 ఆరు రాజకీయ పార్టీలు ఛాలెంజ్ విసురుతున్నాయన్నారు. ఈనెల 31న ముంబైలో సమావేశం జరుగునుందన్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు నడుం బిగించాలని అన్నారు. కేంద్ర ంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ విధ్వంసం సష్టిస్తుందని అన్నారు. ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. భారత దేశంలో 21 కోట్ల ముస్లిం జనాభా ఉన్నారని, కేంద్రంలో ఒక్క ముస్లిము కూడా మంత్రి పదవి లేదన్నారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 18 శాతం ముస్లిములున్నారని చెప్పారు. 424 ఎమ్మెల్యేలు ఉన్న ఆ రాష్ట్రంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. దేశాన్ని బిజెపి ప్రభుత్వం మతం పేరుతో చీలిస్తుంది అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా ఉందన్నారు. నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. విద్యుత్ బిల్లులు ఆస్తి పన్ను చెత్త పన్ను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారం వేశారని వాపోయారు. దోచుకోవడం- దాచుకోవడాకేనా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది అని ప్రశ్నించారు. గజదొంగల పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఏ రంగంలో కూడా అభివద్ధి చెందలేదని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు. ఇవాళ కోరుతనం ప్రభుత్వం రాష్ట్రంలో సాగుతుందని విమర్శించారు. కార్యక్రమంలో ఎఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జి. చంద్ర, నగర కార్యదర్శి వెంకట శివ, నాగ సుబ్బారెడ్డి, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










