ప్రజాశక్తి-కాకినాడ మోడీ 9 ఏళ్ల పరిపాలనలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, ఆయనను గద్దె దించి దేశాన్ని కాపాడాలని పలువురు అఖిలపక్ష నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో కార్మిక, రైతాంగ మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఐఎన్‌టియుసి, అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజలకిచ్చే పప్పు, ఉప్పు, పెన్షన్ వంటి పథకాలపై కార్పొరేట్ మేధావివర్గం పెద్దఎత్తున దేశభివృద్ధికి నష్టమని ప్రచారం చేస్తూ, మరోపక్క కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీపై పల్లెత్తు మాట్లాడకుండా దేశప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులు పాలై దేశంలో ప్రతి 20 నిమిషాలకూ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు. రైతాంగ పంటలకు ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి గిట్టుబాటు ధర చట్టం చేస్తేనే రైతాంగాన్ని సంక్షోభం నుండి కాపడగలమన్నారు. దేశవ్యాప్తంగా నిత్యవసరాలు ధరలు ఆకాశాన్ని చేరుకుంటుంటే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు టేకుముడి ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజబాబు మాట్లాడుతూ తక్షణం నిత్యవసరాలపై జిఎస్‌టిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులు వంటగ్యాస్‌పై కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్నారు. కాకినాడ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంట సాగుబడి జరుగుతుంటే జగన్ ప్రభుత్వ కొనుగోలు నామమాత్రంగానే ఉందని, దీంతో జిల్లా రైతాంగం తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. తక్షణం మొత్తం పంటని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారాలు మోపుతుందని రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు పేరుతో యూనిట్ 50 రూపాయలు అమ్ముకునేందుకు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసిందని విమర్శించారు. ప్రజలను అధిక ధరల నుండి నిరుద్యోగం నుండి రైతాంగ సంక్షోభం నుండి పక్కదారి పట్టించేందుకే బిజెపి పెద్దలు మతోన్మాదాన్ని ప్రాంతీయ తత్వాన్ని కులపరమైన విభజలను తీసుకువస్తూ ప్రజలను విభజిస్తుందని వీటి నుండి ప్రజలు పోరాటాలు చేయడం ద్వారా బిజెపి విధానాలను తిప్పుకొట్టాలని అందుకు 27 28 విజయవాడలో జరిగే మహా ధర్నాలో వేలాదిమంది అసంఘటితరంగా కార్మికులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు పారిశ్రామిక కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ జగన్ జోడిలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు గదుల సాయిబాబు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్సులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లూరి వెంకటేశ్వర్లు, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యన్నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శాఖా రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలరాజు, రైతు సంఘం నాయకులు అప్పారెడ్డి, మధ్యతరగతి రంగం నాయకులు దుంపల ప్రసాద్, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు లచ్చారావు, ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, ఎపి భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, సిఐటియు రూరల్ కమిటీ కన్వీనర్ తొట్టిపూడి రాజా, చంద్రరావు, ఐఎంటియుసి నాయకులు కె.సాయి, బాషా తదితరులు పాల్గొన్నారు.