లక్నో : యుపి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత అజరు రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోడీ, యోగిలను ఉప్పులో సమాధి చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవడం ఖాయమని అన్నారు. ఆహార ధాన్యాలతో పాటు ఉప్పు, వంటనూనెను ప్రభుత్వ పథకం కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు యుపి ప్రభుత్వ ప్రకటనను సూచిస్తూ.. ఫలితాల అనంతరం మోడీ, యోగి సహా బిజెపి నేతలంతా అదే ఉప్పులో సమాధి చేయబడతారని ఎద్దేవా చేశారు. దీంతో అజరు రాయ్ పై రాష్ట్ర బిజెపి యూనిట్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.










