సత్తెనపల్లి: బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ కమ్యూనల్, విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా సిపిఎం ప్రజల ముందు ఉంచుతున్న ప్రణాళికకు మద్దతు తెల పాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ పేర్కొన్నారు. రాజుపాలెం మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రను మూడో రోజుగ దేవరంపాడులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరంగా తయారయ్యాయని, మ: న రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రజా సంపదలను ప్రైవేటు వారికి అప్పగించడానికి సిద్ధమవుతున్న మోడీ విధానాలను వ్యతిరేకించాలన్నారు. మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మోడీని బలపరచడాన్ని ఆయన తప్పు పట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం అని, అలాగే మన పల్నాడు జిల్లా కూడా వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, అటువంటి వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో గత సంవత్సరం కూడా లక్షన్నర ఎకరాలు సాగు భూమి బీడుగా మారిందని, కేవలం పం టలు గిట్టుబాటు కానందు వల్ల, ఈ సంవత్సరం వర్షాలు అననుకూల వాతావరణంతో సగం పైర్లు అసలు వేయ లేదని, వేసిన భూమిలో కూడా పైర్లు ఎండిపోతున్నాయని, అన్నారు. సిపిఎం ప్రజల అబివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 30 డిమాండ్లను రూపొందించి, వాటిని సాధించడం కోసం బిజెపికి వ్యతిరేకంగా విశాల శక్తులను ఏకం చేయడానికి కృషి చేస్తోందని, సిపిఎం విధానాలను ప్రజానీకం బల పరచాలని కోరారు. సిపిఎం పాదయాత్ర కార్యక్రమం ఆదివారం దేవరంపాడు, పెద్ద నెమలిపురి, కోటనేమిలిపురి, కొండమోడు, అంచులవారిపాలెం, అనుపాలెం, చౌటుప్ప పైపాలెం మీదుగా పులిచింతల ఆర్‌ఆర్ సెంటరులో ప్రచా రంతో ముగిసింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ నవంబర్ 15వ తేదీ విజయవాడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ జరగనుందని చెప్పారు. సభలో సిపిఎం ఆల్ ఇం డియా నాయకులు పాల్గొంటారని, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో తెలగపల్లి శ్రీను, ఎ. లక్ష్మీశ్వర్ రెడ్డి, బెల్లం కొండ దుర్గారావు, కె.దుర్గారావు, శ్రీలక్ష్మి ,గుంటూరు మల్లే శ్వరి, తెలగపల్లి కష్ణవేణి, రమణ, సృజనాబాయి, వెంకా యమ్మ, భూలక్ష్మి పాల్గొన్నారు.










