Aug 09,2023 20:49

పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు

రాయచోటి టౌన్‌ : దేశంలో అమలవుతోన్న మోడీ నయా ఉదారవాద అర్థిక విధానాలతో దేశం ప్రమాదంలోకి వెళ్తోందని, నాడు భారత ప్రజానీకం బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను క్విట్‌ ఇండియా పేరుతో తరిమికొట్టారని అదే స్పూర్తితో నేడు మోడీ విధానాలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్య దర్శి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు బుధవారం రెవెన్యూ శాఖ కార్యాలయం ఎదుట సిఐటియు, వ్యవసాయ ,కార్మిక సంఘం రైతుసంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, రైతులు, ప్రజలు, దళిత బహుజనులు నిరసన చేపట్టారు. ఈ సంధ ర్బంగా అయన మాట్లాడుతూ మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత పేదరికం, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, మహిళల పై నిత్యం దాడులు మాన బంగాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, వ్యవసాయ నల్లచట్టాలు, దళితులపై దాడులు, రచయితలు, మహిళల హత్యలు, డేరాబాబుల పుట్టగొడుగుల్లా విస్తరణ, రూపాయి విలువ పడిపోవడం వంటివి చోటు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశౄరు. సాంకేతిక పరిజ్ఞానం వదిలి మూఢనమ్మకాలతో మనువాదాన్ని తెచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచి దేశ ప్రజల మధ్య అసమానతలు పెంచి పోషిస్తున్నారన్నారు. హద్దు లేని నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని పెట్టుబడిదారులకు రాయితీ ఇచ్చి చేతులు దులుపుకోవడంతోనే రెగ్యు లర్‌ ఉద్యోగాలు రావడంలేదన్నారు. ఉన్న పరిశ్రమలు అమ్మకానికి పెట్టి భారత ఖజానాను పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్న మోడీిని ఓడించాలన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శులు ఎస్‌.రామచంద్ర, రంగారెడ్డి మాట్లాడుతూ కార్మిక కర్షక మైత్రితో వ్యవసాయ నల్ల చట్టాలు, లేబర్‌ కోడ్లు, మోటర్లకు మీటర్లు బిగించడం, కలదురంహకార హత్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతు న్నాయని వాపోయారు. ఉద్యమకారులు, ప్రజాతంత్ర శక్తులు దేశవ్యాప్తంగా గట్టిగా ప్రతిఘటించి మతసామరస్యాన్ని ప్రభుత్వ రంగాలకు కాపాడాలని పెద్ద ఎత్తున ప్రజలతో సంతకాల సేకరణ చేసి డిప్యూటీ తహశీల్దార్‌ తాశీల్దార్‌ ద్వారా గవర్నర్‌కు పంపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు, జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, ఓబులమ్మ, రైతుసంఘం బసిరెడ్డి, జిల్లా కో- కన్వీనర్‌ డి.సి. వెంకటయ్య, చిన్న నారాయణ, డీలర్‌ శీను, చల్లా రెడ్డెయ్య, ఐద్వా నాయకురాల్లు బంగారుపాప, సిద్దమ్మ, నాగమణి, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రామాంజనేయులు, విద్యార్థులు దిలీప్‌, నిరంజన్‌ పాల్గొన్నారు.