May 01,2023 01:25
నగరంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకుడు మణిలాల్‌

ప్రజాశక్తి-నగరం: మోడీ ప్రజవ్యతిరేక విధానాలని నిరసిస్తూ నగరంలో సీపీఎం ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నగరం మెయిన్‌ సెంటర్‌లో జరిగిన ప్రచారంలో సీపీఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బిజెపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ధరలు పెద్దఎత్తున పెంచుతున్నారని విమర్శించారు. బిజెపి కుట్రలను ప్రజలకు తెలియజేయా ల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని అన్నారు. అందుకే ఏప్రిల్‌ 14 నుంచి రాష్టవ్యాప్తంగా బీజీపీ విధానాలను నిరసిస్తూ రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యాపార వేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండి మోడీని సాగనంపాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. ప్రత్యేక హౌదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్‌, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్‌-ఇవన్నీ పార్లమెంట్‌ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చినా హామీలు వీటిలో ఏ ఒక్క దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక త్యాగాలు ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మెతక వైఖరి ఆవలంబిస్తూ ఇద్దరు కలిసి ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ నుంచి భారతదేశాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం నగరం మండల కార్యదర్శి కె గోపి, నాయకులు ఏవిపికె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిపాలన విధానాన్ని నిరసిస్తూ బీజేపీని ఓడించండి-దేశాన్ని కాపాడండి అనే నినాదంతో వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ర్యాలీ జరిగింది. కొరిశపాడు మండలంలోని ప్రాసంగులపాడు నుంచి మేదరమెట్ల వరకు బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పమిడిపాడు రావినూతల కుర్రవానిపాలెం కొరిశపాడు గ్రామాలను కలుపుకుంటూ ర్యాలీ జరిగింది. మేదరమెట్లలో సిపిఎం మండల కార్యదర్శి మోండ్రు ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌, హిందుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నందికోలు సుబ్బారావు, కంచర్ల సుధాకర్‌, చావ కోటేశ్వరరావు, చావా జయరావు, కంచర్ల సురేష్‌, వై రవీంద్రబాబు, కొల్లా సుబ్బారావు, సభ్యులు పాల్గొన్నారు.