Feb 09,2023 23:27

 అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు వై. కేశవరావు
ప్రజాశక్తి-మైలవరం 

ప్రధాని నరేంద్ర మోడి అనుసరిస్తున్న విధాన వల్లే రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు వై. కేశవరావు అన్నారు. 'రైతాంగ సమస్యలను. పరిష్కార మార్గాలు' అనే అంశంపై స్థానిక వ్యవసాయ మార్కెట్టు యార్డు ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వుందని, దీని ప్రభావం ఎ.పిలో కూడా వుందన్నారు. రైతాంగ సమస్యలపై రైతులందరూ ఐక్య పోరాటాలకు సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎ.పిలో రైతు పండించిన ధాన్యాన్ని సొసైటీల ద్వారా కొనుగోలు చేశారని, ఆ ధాన్యానికి నేటి వరకూ రైతులకు డబ్బులు అందకపో వడంతో ఆర్ధికంగా నష్టపోతున్నారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్టు యార్డులలోని నిల్వ వుంచి, కాలయాపన చేస్తూ రైతులకు డబ్బులు చెల్లించడంలేదన్నారు. ఎరువులు, పురుగు మందుల దరలు విపరీతంగా పెరిగాయని, అప్పు చేసిన రైతులకు తీవ్ర నష్టాలే ఎదురవుతున్నాయన్నారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, పి.వి ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వజ్రాల ధనలకిë, మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు చెందిన రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.