పకడ్బందీగా జనసమీకరణ : మంత్రి అమర్
ప్రజాశక్తి - యలమంచిలి : శనివారం విశాఖలో జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఇమేజ్ పెంచేందుకు వైసిపి శ్రేణులు కృతనిశ్చయంతో పనిచేయాలని మంత్రి అమర్‌నాధ్ పిలుపునిచ్చారు. గురువారం యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు క్యాంపు కార్యాలయంలో మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాల పార్టీ ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని సభకు మూడు లక్షల మందిని తరలించడం లక్ష్యమని, అందులో భాగంగానే యలమంచిలి నియోజకవర్గంలో 104బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మాట్లాడుతూ సభకు వచ్చేవారికి బస్సులు, ఆహారం అన్నీ సుకుమార్‌వర్మ చూసుకుంటారన్నారు. ఎంపిపి బోదెపు గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బొద్దపు ఎర్రయ్యదొర పాల్గొన్నారు.
కె.కోటపాడు: ఈనెల 12న ప్రధాని మోడీ సభకు భారీగాతరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపిపి రెడ్డి జగన్మోహన్ కోరారు. గురువారం ఎంపిపి కార్యాలయంలో వైసిపి నేతలతో కలిసి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కె.కోటపాడు నుంచి జనసమీకరణకు 60 బస్సులు ఏర్పాటు చేశామని, సభకు వచ్చేవారికి భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.మండలం నుంచి ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఇతర నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.










