ప్రజాశక్తి- కంచరపాలెం : స్టీల్‌ప్లాంట్ అమ్మాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకుని, ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిిమాండ్ చేస్తూ కంచరపాలెంలో సిపిఎం జోన్ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మోడీ గో బ్యాక్ నినాదాలు చేశారు. ప్రధాని. మోడీతో ప్రకటన చేయించడంలో విఫలమైన ముఖ్యమంత్రి జగన్, అదే పనిచేస్తున్న వారిని పోలీసులతో అరెస్ట్‌లు, నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. సిఐటియు నాయకులు ఎస్ సోమేశ్వరరావు, ఒ అప్పారావు, ఈశ్వరరావు పాల్గొన్నారు
హెచ్‌పిసిఎల్ మెయిన్‌గేటు వద్ద నిరసన
ములగాడ : విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మబోమని సభలో మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హెచ్‌పిసిఎల్ మెయిన్‌గేటు వద్ద సిఐటియు, ఐఎన్‌టియుసి కార్మికసంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షుడు కె.పెంటారావు, ఐఎన్‌టియుసి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు భోగవల్లి నాగభూషణం, సిఐటియు నేతలు పి.పైడిరాజు, ఎం.కృష్ణారావు, జి.నరేష్, పి.సురేష్, టిఎన్‌టియుసి నేత పి.కృష్ణ, ఐఎన్‌టియుసి నేత తాతబాబు, నర్సింగరావు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలతోపాటు అనుబంధ కార్మిక సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్‌లు, గృహనిర్బంధాలు చేయడం దారుణమని సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు ఒక ప్రకటనలో ఖండించారు.
మధురవాడ :ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును అమ్మొద్దని డిమాండ్ చేస్తూ జివిఎంసి మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐదోవార్డు మారికివలస జివిఎంసి కల్యాణమండపం వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి కార్మికులు నిరసన చేపట్టారు. యూనియన్ మధురవాడ జోన్ కార్యదర్శి జి.కిరణ్, సిఐటియు జోన్ అధ్యక్షుడు డి.అప్పలరాజు, వార్డు అధ్యక్షులు జి విజరు, కొండమ్మ, జయమ్మ, వి చిన్న, ఎ.సత్యం పాల్గొన్నారు.
పెందుర్తి:స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మోడీ రాకను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో 97వ వార్డు సుజాతనగర్ కూడలిలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఆర్.శ్రీనివాసరావు సిఐటియు నాయకులు సూర్యప్రకాష్, శంకరరావు, జగనన్న, స్వామి. కె.అప్పలనాయుడు, సిపిఐ నాయకులు వై రాంబాబు పాల్గొన్నారు
గాజువాక : స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విశాఖలో ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ ఆటోనగర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిఐటియు నగర కమిటీ సభ్యులు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ విభజన హామీల అమలులో మోసం, స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
భెల్ మెయిన్‌గేటు వద్ద ధర్నా
గాజువాక : స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భెల్ మెయిన్ గేటు వద్ద అఖిలపక్ష కార్మికసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కార్మిక నేతలు జిటివి. ప్రకాష్, వి. బాబురావు, పిఇఎన్. రాజు, ఎ. వెంకటేశ్వరరావు, ఎస్ షాహు, పాల్గొన్నారు.
డివైఎఫ్‌ఐ నిరసన
కంచరపాలెం : ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని యువతను నమ్మించి మోసగించిన ప్రధాని మోడీకి సమాధానం చెప్పాలనిడిమాండ్ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వాసు, పి.విజయ, ఎస్ శ్రావణ్ కుమార్, బి. మురళి, స్టీఫెన్ పాల్గొన్నారు.
తగరపువలస : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని స్థానిక వై.జంక్షన్‌లో సిపిఎం, సిఐటియు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ నగరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు పాల్గొన్నారు.
పిఎం పాలెం: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చేస్తూ, విభజన హామీల అమలులో రాష్ట్రాన్ని మోసపుచ్చిన ప్రధానిమోడీ విశాఖ పర్యటనను నిరసిస్తూ మధురవాడ జివిఎంసి జోన్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఎం, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం, సిపిఐ డివిజన్ నేతలు నాయకులు డి అప్పలరాజు, వి సత్యనారాయణ సిఐటియు జోన్ ప్రధాన కార్యదర్శి పి.రాజ్‌కుమార్, సిపిఐ కార్యకర్తలు ఎం బంగారయ్య, తాతారావు , పాల్గొన్నారు.
ములగాడ: విశాఖలో మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా సిఐటియు మల్కాపురం జోన్ కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తిని నెహ్రునగర్‌లోని అతని ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు.
అనకాపల్లి : రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నెహ్రూ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిఎస్ అజరు కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాథ్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకర్రావు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ వైఎన్.భద్రం మాట్లాడారు. సిపిఎం నాయకులు కర్రి అప్పారావు, సుభాషిణి, పెంటకోట శ్రీనివాసరావు, కాళ్ళ తేలయ్య బాబు, పి చలపతి, బి నూక అప్పారావు, సిపిఐ నాయకులు దొరబాబు, కోన లక్ష్మణ, సన్యాసిరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని ఎ.కోడూరు గ్రామంలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్ సంఘీభావం తెలిపారు. సిపిఎం నాయకులు రొంగలి ముత్యాలనాయుడు, ఎర్ర దేవుడు, గూనూరు నాయుడు పాల్గొన్నారు.
సబ్బవరం : సీపీఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి ఆధ్వర్యాన స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో ముఠా కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మొల్లేటి గౌరీశ్వరరావు, నరసమ్మ, ముఠా కార్మికులు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ ఫార్మసిటీలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు కండిపల్లి అప్పలరాజు, రమణ, జి.చిట్టిబాబు, పి శేషు, మూసిలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటనను నిరసిస్తూ నక్కపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ఉపమాక ముఖ ద్వారం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం.రాజేష్‌లు మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రం లో పర్యటించే అర్హత లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేశారని, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం కారుచౌకగా అమ్మేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్‌బాబు, వీర్రాజు, నాగేశ్వరరావు, తాతాజీ, రామకృష్ణ, అప్పలరాజు, వీరన్న, జాన్, బాపూజీ, బాలయ్య, రాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: పీఎం గో బ్యాక్ అంటూ స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బ్లాక్ జెండాలతో నిరసన చేపట్టారు. వామపక్ష నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, డి సత్తిబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి విభజన హామీ అమలు చేయలేదని. ప్రత్యేక హౌదా ఊసే లేదని తెలిపారు.అంబానీ వంటి బడా బాబులతో పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం చూస్తోందని విమర్శించారు.స్టీల్ ప్లాంట్, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్ ఎల్‌ఐసి, బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివలంక కొండలరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.గురుబాబు, ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు ఎల్.వి. రమణ, సిఐటియు నాయకులు కే నానాజీ, టి.ఈశ్వరరావు, నర్సీపట్నం నియోజకవర్గ మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, జోగురాజు, శ్రీరామమూర్తి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు.










