Apr 21,2023 19:30

ప్రచార భేరి నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పెద్దకడబూరు
కేంద్రంలోని మతోన్మాద బిజెపిని ఇంటికి సాగనంపాలని సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. శుక్రవారం మండలంలోని చిన్నతుంబలం బస్టాండ్‌ ఆవరణంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఈడిగ తిక్కన్న గౌడ్‌, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్‌, రైతు సంఘం కార్యవర్గ సభ్యులు పరమేష్‌ మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు.