ప్రజాశక్తి- పాలకొండ : దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త ప్రదర్శ నలు, మహాధర్నాలను విజయ వంతం చేయాలని సోమవారం పాలకొండలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది ఏళ్ల మోడీ పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసే విధానాలు తెచ్చి ప్రజలపై భారాలు మోపిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం దేశానికి ప్రజలకు క్షేమం కాదన్నారు. అందుకోసమే ఈనెల తొమ్మిదో తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు కాద రాము, పామోటి సంగమేశ, శ్రీదేవి, విమల భాస్కరరావు, సంజీవి, సురేష్, జై రాము, హరిబాబు, ఎన్.వంశీ, కె.సూర్యా రావు, టి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










