Jul 23,2023 21:48

మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పీలేరు : దేశంలోని మోడీ పాలనలో ఎస్‌సి, ఎస్‌టి, క్రైస్తవ, మైనార్టీలకు రక్షణ కరువైందని ప్రజాసంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో అం బేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం మాల మహా హానాడు మండల ప్రచార కార్యదర్శి దప్పేపల్లి అనంద్‌ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు మదనపల్లి - తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, మైనార్టీలపై రోజు రోజుకూ దాడులు అధికమవుతున్నాయని అన్నారు. మణి పూర్‌లో గిరిజన మహిళలపై హత్యాచారాలు అధిక మయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు గిరిజన మహిళలను నగంగా ఊరేగించి అత్యా చారం చేసిన ఘటన సామాన్యునే కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. మణిపూర్‌లో పరిపాలన చేతకాక గత రెండు నెలలుగా బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహించి నీచ రాజకీయాలు చేస్తున్న కారణంగా అక్కడ శాంతి భద్రతలు కరువ య్యాయని పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల దురా గతాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అక్కడి ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీ సులు, పారా మిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. మణిపూర్‌లో మానవత్వం మంటకలిసిందని, పశుత్వం పెచ్చు పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బిజెపి పాలనలో తప్ప మన దేశ ప్రతిష్ట ఇంతగా ఎప్పుడూ దిగజారలేదని వాపోయారు. కార్యక్ర మంలో జాస్‌ జిల్లా మహిళా అధ్యక్షులు గుండ్లురు రాజేశ్వరి, మైనార్టీ మండల అధ్యక్షులు పఠాన్‌ హసీనా, ముస్లిమ్‌ జెఎసి నాయకులు పఠాన్‌ మౌలా, అమీర్‌, మాల మహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌, విసికె పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పాలకుంట శ్రీనివాసులు, బిఎస్‌పి పీలేరు నియో జకవర్గ ఇన్‌ఛార్జి చీకటిపల్లి ఎర్రప్ప, ఎపిఎం ఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు వేల ూరు గురునాధం, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కార్మికుల సంఘం అధ్యక్షులు ధనాసి వెంకట్రాయ్య, మాల మహాసేన రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లిగారి వెంకటస్వామి, మాలమహనాడు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, జాస్‌ జిల్లా లీగల్‌ అడ్వయిజర్‌ గుండ్లురు సదాశివ, మచ్చ రెడ్డప్ప, ముస్లిమ్‌ జెఏసి నాయకులు ఖాదర్‌ వల్లి, సాదిక్‌, మౌలాలీసాహెబ్‌, తమీమ్‌, మేముసైతం సంస్థ వ్యవస్థాపకులు షాహిన్‌షా మోదిన్‌ బాష, బాస్‌ జిల్లా నాయకులు ముల్లంగి క్రిష్ణయ్య, పీలేరు నియో జకవర్గ అధ్యక్షులు ఎర్రబల్లి మల్లికార్జున, ఆరమ డకల నాగరాజ, జాస్‌ నాయకులు మల్లికార్జున, సురేంద్ర, శంకర్‌, పాల్గొన్నారు.