మోడీ నుంచి దేశాన్ని కాపాడుకుందాం- 'క్విట్ మోడీ.. సేవ్ ఇండియా' నినాదంతో నిరసన
కడప అర్బన్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కడప హెడ్‌పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం సిఐ టియు, ఎఐటియుసి, రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సం ఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మనోహర్, నాగ సుబ్బారెడ్డి, దస్త గిరిరెడ్డి, అన్వేష్, ఎం. వి. సుబ్బా రడ్డి, సుబ్బమ్మ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆలంబి óస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధా నాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ, కార్మికులను బాని సలుగా మార్చేందుకు 44 లేబర్ చట్టా లను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చా రని, 3 వ్యవసాయ చట్టాల రూపంలో రైతాంగ భూములను కార్పొరేట్లకు అప్ప గించేందుకు ప్రయత్నించారని విమర్శి ంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదా యం తీసుకొచ్చే విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేట్ దోపిడీదారులకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. 8 ఏళ్ల కాలంలో ఆరు లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. వీటిలో పనిచేసే లక్షలాదిమంది కార్మి కులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. భారతదేశం మోడీ హయాంలో ఆకలి సూచికలో బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకంటే వెనుకపడినట్లు ప్రపంచ గణాంకాలు తెలి యజేస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగం, అధిక ధరలు, ఆహార సంక్షోభాన్ని మోడ ప్రీభుత్వం పరిష్కారం చేయలేక, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే వివక్షపూరిత సిఎఎ, ఎన్‌ఆర్‌సి, యుసిసి చట్టాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తు న్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే మణిపూర్ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా కలిసున్న మెయితీ, కుకీ ప్రజల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల సమస్యను సష్టించి మారణ హోమానికి కారణమ య్యారని తెలిపారు. మోడీ ఏం మాట్లా డాలో, ఎం చేయాలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయిస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద ఎజెండాను అమలు చేయడమే మోడీ కర్తవ్యంగా భావి స్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మోడీ మనసులో భారత రాజ్యాం గానికి కానీ, ప్రజాస్వామ్యానికి గాని స్థానంలేదని విమర్శించారు. కార్మికులకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తుం దన్నారు. మోడీ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే పార్టీలకు ప్రజలు, కార్మికులు, మేధావులు ఓటుద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఎల్‌ఐసి డివిజనల్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూన్నదని విమ ర్శించారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీని వాసులురెడ్డి, జి. వేణుగోపాల్, వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఉద్దె. మద్దిలేటి, చంద్రా రెడ్డి, బాదుల్లా, లక్ష్మీదేవి, సుబ్బమ్మ, కామేశ్వరమ్మ, భాగ్యమ్మ, డివై ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, విజరు, ఉదరు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్య క్షుడు ఎం. ఆర్. నాయక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసయ్య, వా మపక్ష కార్మిక సంఘాల నాయకులు నాగి రెడ్డి, సుబ్బరాయుడు, ఆర్.బాబు, ఈశ్వ రయ్య, మునెయ్య, బాబు పాల్గొన్నారు.
పోరుమామిళ్ల : మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాలు అమలు చేయడం లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు పట్ట ణంలోని సబ్ పోస్టల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ పో స్టాఫీసు అధికారి వినతి పత్రం అంద జేశారు. కార్యక్రమంలో సిఐ టియు మం డల నాయకులు సుందరం, రత్నం, అంగ న్వాడీ మండల నాయకురాలు రేణుకాదేవి, స్వాతి, రమాదేవి, సిఐటియు కార్యకర్తలు మాబు, బీబి, లూర్దమేరి, లక్షుమ్మ పాల్గొన్నారు.










