Aug 06,2023 21:25

నిరసన తెలియజేస్తున్న ఎఐటియుసి, సిఐటియు నాయకులు

 కడప అర్బన్‌ : ప్రధానమంత్రి మోడీ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందామని ఎఐటియుసి, సిఐ టియు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పాత బస్టాండ్‌ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, మనోహర్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఆలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న క్విట్‌ ఇండియా ఉద్యమ స్పూర్తితో కేంద్ర కార్మిక సం ఘాలు 9 చలో విజయవాడ, కడపలో హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ, కార్మికులను బానిసలుగా మార్చేందుకు 44 లేబర్‌ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారని విమ ర్శించారు. 3 వ్యవసాయ చట్టాల రూపంలో రైతాంగ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేట్‌ దోపిడీదారులకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. 8 ఏళ్ల కాలంలో ఆరు లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వీటిలో పనిచేసే లక్షలాదిమంది కార్మి కులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. భారతదేశం మోడీ హయాంలో ఆకలి సూచికలో బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలకంటే వెనుకపడినట్లు ప్రపంచ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. నిరుద్యోగాన్ని, అధిక ధరలను, ఆహార సంక్షోభాన్ని మోడ ప్రీభుత్వం పరిష్కారం చేయలేక, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే వివక్షపూరిత సిఎఎ, ఎన్‌ఆర్‌సి, యుసిసి చట్టాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో భాగంగానే మణి పూర్‌ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా కలిసున్న మెయితీ, కుకీల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల సమస్యను సష్టించి మారణ హోమానికి కారకులయ్యారని తెలి పారు. మోడీ ఏం మాట్లాడాలో, ఎం చేయా ో ఆర్‌ఎ స్‌ఎస్‌ నిర్ణయిస్తుందని, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద ఎజెండాను అమలు చేయడమే ప్రధాని కర్తవ్యంగా భావిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ మోడీ మనసులో భారత రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామ్యానికి గాని స్థానంలేదని పేర్కొన్నారు. కార్మికులకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. మోడీ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే పార్టీలకు ప్రజలు, కార్మికులు, మేధావులు ఓటుద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె. మద్దిలేటి, నగర అధ్యక్షుడు పిచ్చినేని సుబ్బారాయుడు, సిఐటియు నాయకులు లక్ష్మీదేవి, చంద్రారెడ్డి, డివైఎఫ్‌ఐ కడప నగర కార్యదర్శి ఓబులేసు, విజరు, ఉదరు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఎఐటియుసి అనుబంధం కడప నగర కార్యదర్శి తారక రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎంఆర్‌ నాయక్‌, ఎఐటియుసి కడప నగర నాయకులు నాయకులు నాగిరెడ్డి, సుబ్బరాయుడు, ఆర్‌ బాబు, బీమరాజు, ఈశ్వరయ్య, వెంకటాద్రి , చంద్ర, వికాస్‌, ఐజాక్‌, మునెయ్య, బాబు పాల్గొన్నారు.