Nov 11,2023 00:58
ప్రజా రక్షణ భేరిలో పాల్గొన్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-చీమకుర్తి: రాష్ట్రంలో ప్రజాసమస్యలను వదిలేసిన ప్రధాన పార్టీలు మోడీ భజన చేస్తున్నాయని సిపిఎం నాయకులు విమర్శించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో ప్రజారక్షణ భేరి యాత్ర సాగింది. మండలంలోని కెవి పాలెంలో యాత్ర ప్రారంభమైంది. ఏలూరివారిపాలెం, గోనుగుంట, ఎంవిపాలెం, మర్రిపాలెం, జివిపాలెం, జిల్‌పురం, పిసిపాలెం, పిడతలపూడి, ఆర్‌సిపురం, బూసరపల్లి, రావిపాడు, పులికొండ, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, నిప్పట్లపాడు, దేవరపాలెం, చీమకుర్తి పట్టణం రామ్‌నగర్‌లలో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. ఆయా గ్రామాలలో నాయకులు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో భాగంగా ఈ నెల 15న విజయవాడలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు, సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటావు, మండల నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు, క్రిష్టిపాటి చిన్నపురెడ్డి, బెజవాడ శ్రీను, కొల్లూరి వెంకటేశ్వర్లు, పులి ఓబులరెడ్డి, బొడ్డు ఓబులేసు, సిహెచ్‌ కొండయ్య, మాదాల నారాయణ, కొల్లూరి అక్కయ్య, మాదాల నరసింహారావు, వేమా కొండయ్య, నరసారెడ్డి పాల్గొన్నారు.