మొక్కలు నాటుతున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కోరారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు సమాజ శ్రేయస్సు కోసం ఎస్‌ఎఫ్‌ఐ పాటుపడుతోందని తెలిపారు. పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వకున్నా బతుకుతారు కానీ, ఆక్సిజన్ లేకుండా బతకలేరని చెప్పారు. మొక్కలు నాటి రాబోయే తరాలకు ఆరోగ్యాన్ని పంచుదామని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్, నాగరాజు, వీరేష్, గౌస్, శశి, విష్ణు పాల్గొన్నారు.










