ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఎపి బయోడైవర్సిటీ బోర్డు, ఐఆర్‌పిడబ్య్లూ సంస్థ ఆధ్వర్యాన శనివారం నరిసిపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అవరణలో నాటే మొక్కలను బతికించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రామంలోని వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్ విగ్రహానికి సర్పంచ్ బంగారమ్మతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్ నగరంలో ఎంపిటిసి బడేరామారావు, తాళ్లబురిడిలో జడ్‌పిటిసి బలగ రవతమ్మ, నాగేశ్వరరావు దంపతులు, బస్టాండ్ వద్ద ఎంపిటిసి లక్ష్మితో కలిసి ఎమ్మెల్యే పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ కోఆర్డినేటర్, విశ్రాంత డిఎఫ్‌ఒ జానకీరావు, ఐఆర్‌పిడబ్య్లూ డైరెక్టర్ పికె ప్రకాశ్, బయెడైవర్సిటీ సలహాదారులు పట్నాయక్, జానీ, దయ, గణేష్, వెంకటేష్, వైసిపి నాయకులు కాపారపు సత్యనారాయణ, గుర్రాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.










