
ప్రజాశక్తి - చీరాల
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పేరాల ఎఆర్‌ఎం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి సాల్మన్ అన్నారు. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో స్వచ్చతా హై సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, పర్యావరణానికి ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయో అవగాహన కల్పించారు. విద్యార్థులు అందరూ తమ ఇంటి పరిసరాల్లో, పొలాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారాన్ని అందిచాలని విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటడం ద్వారా కాలుష్యం నియంత్రించ వచ్చన్నారు. కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధి శవనం చంద్రారెడ్డి పాల్గొన్నారు.