పొలాలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ సరోజిని
ప్రజాశక్తి-నగరం: గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న, వేరుశెనగ పొలాలను ఆర్‌డిఒ పి సరోజిని గురువారం సందర్శించారు. నష్టపోయిన పొలాల జాబితాలో నమోదు చేసిన రైతుల పేర్లను మరోసారి పరిశీలించేందుకు ఆర్‌డిఒ సరోజినితో పాటు మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కెవి శ్రీనివాసరావు వచ్చి సూపర్ చెక్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారులు వి రమేష్ బాబు, ఎం సుమంత్, వ్యవసాయ విస్తరణ అధికా రి కె నాగశ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకు లు, గ్రామ రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.










