ప్రజాశక్తి-మైలవరం : మొక్కజొన్నలు,ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్క జొన్నలను, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులు వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా 1962 రూపాయలకే కొనుగోలు చేయాలని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారన్నారు. రోజుల తరబడి రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని మరోవైపు అకాల వర్షాలకు రైతులు కలవర పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్క జొన్నలు, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి,రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, రైతులు,పాల్గొన్నారు.










