Nov 04,2023 21:50

సీతంపేటలో ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తామని, అందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మద్దతు ధర ఇస్తామని వైసిపి ఉత్తుత్తి ప్రకటనలకే తప్ప నిజంగా కొనుగోలు కేంద్రాలు ఎక్కడా మచ్చుకైనా ఎక్కడా కనిపించడం లేదని సాలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మండలంలోని తోణాం, మెట్టవలస గ్రామాల్లో శనివారం బాబు ష్యూర్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గడపగడపకు తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు ట్రైకార్‌ రుణాలు, వివిధ రకాల పథకాల పేర్లతో లబ్ధి చేకూరిందన్నారు. అందులో కనీసం 10శాతం అయినా వైసిపి ప్రభుత్వంలో అందడం లేదన్నారు. గిరిజనులు తమ బాధలు చెప్పుకోవడానికి ఐటిడిఎ కార్యాలయం ఉండేదని, ఆ కార్యాలయానికి వెళ్లి గిరిజనులు వారి బాధలను చెప్పుకునే వారని, తగు సమయంలో పై అధికారులు వారి సమస్యలను తీర్చే వారిని, కానీ ఇప్పుడు అసలు ఐటిడిఎలో ఎవరు వున్నారో? ఎప్పుడు వస్తున్నారో? ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. దొంగ మద్యంతో వేలకోట్లు సంపాదిస్తున్న జగన్‌ మద్యం అక్రమాలు జరిగాయని, గతంలో చంద్రబాబు ఇసుకను ఉచితంగా ఇస్తే ఇసుక ద్వారా అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని, దీన్ని ప్రజలంతా గమనించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, యుగంధర్‌, భాస్కరరావు, రజిని, తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ఆధ్వర్యాన మండలంలోని చిన్నబగ్గ, కిసారజోడు, మర్రిపాడు, పూతికవలస, ఈతమానుగూడ పంచాయతీల్లో బాబు ష్యూర్టీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫేస్టోలోని అంశాలపై ప్రజల్లో చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సవరతోట మొఖలింగం, బీసీ సెల్‌ అధ్యక్షులు ఆర్‌.రంగనాథం, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు గంట సుధ, సర్పంచ్‌ బిడ్డిక నీలయ్య, ఐటీడీపి కోఆర్డినేటర్‌ హిమరక పవన్‌, ప్రచార కర్త తోయిక సంధ్యరాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం పిటి మండ పంచాయతీ పల్లపు సిరిపి, నడిమి సిరిపి గ్రామాల్లో బాబు ష్యూర్టీ- భవిష్యత్తు గ్యారెంటీ'' కార్యక్రమం కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు పల్ల రాంబాబు, అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, అరుకు పార్లమెంట్‌ ఎస్‌టి సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, క్లస్టర్‌ 6 జోగి భుజింగరావు, పంచాయతీ సర్పంచ్‌ ఆరిక చలపతి, టికె జమ్ము పంచాయతీ సర్పంచ్‌ అడ్డాకుల సుందరరావురావు, పలువురు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.