Mar 20,2023 15:52

ప్రజాశక్తి-చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 9 వాహనాలను మావోయిస్టు తగలబెట్టినారు. వివరాలు ఇలా ఉన్నాయి ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో రోడ్డు నిర్మాణ పనులకు ముందుగా పోలీస్ బలగాలను మొహరింపజేసి ఆ తర్వాత రోడ్డు నిర్మాణ పనులు చేపడతారు కానీ కాంకేర్ జిల్లాలో మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం కొరకు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గుత్తేదారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో నిధి గ్రహించిన మావోయిస్టులు అవకాశంగా తీసుకొని రోడ్డు నిర్మాణ పనులకు వచ్చిన 9 వాహనాలను తగలబెట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న కామ్ కేర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.