Aug 27,2023 20:08

విచారిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -పొదలకూరు :మండలంలోని మొగల్లూరులో వైసిపిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మాజీ సర్పంచ్‌ పెంచలరెడ్డి అనే వ్యక్తిపై అదే పార్టీలోని మరోవర్గానికి చెందిన గంగాధర్‌ , జనార్థన్‌ రెడ్డి, గంగిరెడ్డి, అనే వ్యక్తులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో పెంచలరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.