ప్రజాశక్తి-గొలుగొండ:చట్టసభలలో ప్రశ్నించే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు కోరారు. ఆదివారం మండలంలోని ఎర్రవరం రాజులుబాబు గుడి వద్ద సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ శెట్టి పైడియ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రామునాయుడు మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవాలని కోరారు. విద్యార్థి, నిరుద్యోగ, యువజన, ఉపాధ్యాయుల ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మేకా సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్‌వి.రమణ, సిపిఐ మండల కార్యదర్శి మేకా భాస్కర్ రావు, ఏఐవైఎఫ్ జి.రాధాకృష్ణ, లోకరపు అప్పలనాయుడు, ఎం.అప్పలనాయుడు, బాబులు, ఎం.బాబులు పాల్గొన్నారు.
కొత్తకోట:కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ కెవిపిఎస్, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్తకోట, మేడివాడ, గర్నికం, రావికమతం గ్రామాలలో విస్తత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ, ఉద్యోగ, కార్మిక ఔట్సోర్సింగ్ ఉద్యోగ, ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సిహెచ్ సూరిబాబు, మర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.
వారపుసంతలో ప్రజాసంఘాల ప్రచారం
కొయ్యూరు. : ఉత్తరాంథ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభను విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని వారపుసంగిరిజన సంఘం, సిఐటియు ఆధ్వర్యంలోప్రచారం నిర్వహించారు. సంతకు వచ్చే పట్టభద్రుల ఓటర్లతోపాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఉద్యోగులు, స్కీం వర్కర్స్‌ను కలిసి రమాప్రభకు మొదటిప్రాధాన్యత ఓటేయాలని కోరారు.
ఏజెన్సీలో జిఒ 3 పునరుద్ధరణ, 1/70, అటవీ హక్కులు, ఇతరత్రా గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్, ఏజెన్సీలో స్పెషల్ డిఎస్‌సి జారీ, ఇతర సమస్యలపై శాసనమండలిలో ఉత్తరాంధ్ర వాణి వినిపించాలంటే రమాప్రభ గెలుపు ఎంతో అవసరమన్నారు.
అనకాపల్లి : మండలంలోని తుమ్మపాల చిన్నబాబు కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ సిఐటియు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రచారం నిర్వహించారు.. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలంటే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కార్యక్రమంలో ఆర్ శంకరరావు, భాస్కరరావు, శాస్త్రి, ఆనంద్, రమేష్, అజరు, తరుణ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
పెందుర్తి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా 94వ వార్డు పరిధి రవినగర్‌లో ఐద్వా ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీచేశారు. పట్టభద్రులు ఆలోచించి ఉన్నతమైన వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఐద్వా నాయకులు లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో బి.రమణి, రజిని. సుహాసిని, సూరీడమ్మ, ప్రదీప్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ సిఐటియు, సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యాన సింహాచలం ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కోరెడ్ల రమాప్రభకు వేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.










