Jun 13,2023 00:03

ఆహారాన్ని అందిస్తున్న అయన్న

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద సోమవారం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ,అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజల ఆకలి తీర్చడమే తెలుగుదేశం లక్ష్యం అన్నారు. జగన్‌ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లను మూసివేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడని పేదోడి నోటి దగ్గర ముద్దనూరు లాక్కున్న ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభి స్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. టిడ్కో ఇళ్లను లభ్డిదారులకు ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలు గా తాత్సారం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌, శ్రీకాంత్‌, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, కొరుప్రోలు శ్రీను, అప్పలరాజు పాల్గొన్నారు.