Jul 07,2023 21:38

బ్యాంకాక్‌ : మయన్మార్‌లోని ఒక గ్రామంపై గురువారం రాత్రి జరిగిన మోర్టార్‌ దాడిలో 15మంది పౌరులు మరణించారు. రెస్టివ్‌ సెంట్రల్‌ ఏరియాలో జరిగిన ఈ దాడికి ప్రజాస్వామ్య అనుకూల పోరాట యోధులే కారణమని మయన్మార్‌ సైనిక ప్రభుత్వం ఆరోపించింది. కాగా ఆ ఆరోపణలను గెరిల్లా గ్రూపు ఖండించింది. సాగెయింగ్‌ రీజియన్‌లోని నెగ్వె ట్విన్‌ పట్టణంపై బుధవారం తెల్లవారు జామున 4గంటలకుమోర్టార్లతో పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (పిడిఎఫ్‌) దాడి చేసిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మయన్మా అలిన్‌ వార్తాపత్రిక పేర్కొంది. ఈ దాడిలో 15మంది మరణించగా, ముగ్గురు సన్యాసులతో సహా 7గురు గాయపడ్డారు. 2021 ఫిబ్రవరి 1న సూకీని పదవి నుండి తొలగించినప్పటి నుండి పిడిఎఫ్‌ గ్రూపులు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ గ్రూపులు మిలటరీ పాలనను వ్యతిరేకించే ప్రజాస్వామ్య అనుకూల నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాని(ఎన్‌యుజి)కి మద్దతునిస్తునాుయి. కాగా ఈ దాడిపై వ్యాఖ్యానించడానికి ఎన్‌యుజి అధికారులెవరూ శుక్రవారం అందుబాటులోకి రాలేదు. ఇటువంటి సంఘటనలు జరిగినా వాటి వివరాలు తెలుసుకోవడానికి, నిర్ధారించడానికి సాధ్యం కావడం లేదు. మిలటరీ ప్రభుత్వం ప్రయాణాలపై కఠినంగా విధించిన ఆంక్షలే ఇందుకుప్రధాన కారణంగా వుంది. అయితే ఈ గ్రామం నుండి మిలటరీ అనుకూల మిలీషియా పనిచేస్తునుందునే ఈ గ్రామానిు లక్ష్యంగా చేసుకునుట్లు ప్రాంతీయ పిడిఎఫ్‌ సభ్యుడు మీడియాకు తెలిపారు.