Apr 16,2023 00:01

కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలో శనివారం సాయంత్రం పిడుగు శబ్దాలతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ఎక్కువగా కాసింది. ఆ తర్వాత వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎండల తీవ్రతకు ఉక్క పోతకు గురైన గిరిజనులకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది.
పెదబయలు:మండల కేంద్రంలో శనివారం సాయంత్రం సుమారు 5గంటల సమయంలో వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం విపరీతమైన ఎండ కాసింది. సాయంత్రానికి ఒకేసారి వాతావరణంలో.మార్పులు చోటు చేసుకొని కుండ పోతగా వడగళ్ల వాన కురవడంతో వాతావరణం చల్లబడింది.