Jun 12,2023 23:50

అనంతగిరిలో కురుస్తున వర్షం

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:అరకులోయలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మండలంలోని కొత్తబల్లుగూడ పంచాయతీ సరన్నాయిగూడ గ్రామంలో వృక్షం కూలడంతో మూడు ఇల్లులు ధ్వంసం కాగా నలుగుగురుకీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వర్షం కురుస్తున్న సమయంలో పాంగి హేమ ఇంట్లో ఉండగా చెట్లు విరిగి పడటంతో తన తలపై బలమైన గాయం అయ్యింది. కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
అనంతగిరి:మండలంలో సోమవారం కుండపోత వాన కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక మండల వాసులు అవస్థలు పడుతున్నారుసోమవారం ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది మండల కేంద్రంలోని వారపు సంతలో చిరు వ్యాపారస్తులు బ్బందులకు గురయ్యారు.