ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మంగళవారం గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ట్లేలో అల్లూరి చిత్రపటానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలేసి నివాళులర్పించారు. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, జెసి జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణశర్మ నివాలులర్పించగా డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, డిప్యూటీ కలెక్టర్లు మోవిడి వాణి, సాయిశ్రీ, జెడ్‌పి సిఇఒ మోహనరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణబాబు, జిల్లా భూగర్భ జలవనరులశాఖ ఉప సంచాలకులు వందనం, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు సువార్త, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. తొలుత నాజ్ సెంటరులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్, వేణుగోపాల్ రెడ్డి, జిఎంసి కమిషన్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే మహహ్మద్ ముస్తఫా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.శేషగిరిరావు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పోరేషన్ చైర్మన్ మండేపూడి పురోషోత్తం పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. పల్నాడు కలెక్టరేట్‌లో కలెక్టర్‌తోపాటు డిఆర్‌ఒ వినాయకం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దుర్గాబాయి నివాళులర్పించారు. లింగంగుంట్ల అగ్రహారం పరిధిలో శంకర భారతిపురం జెడ్‌పి పాఠశాలలో, రోటరీక్లబ్ ఆధ్వర్యంలో నివాళులర్పించగా కలెక్టర్‌తోపాటు రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పూలమాలేశారు. ఎఆర్ అదనపు ఎస్పీ డి.రామచంద్రరాజు, ఎఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఎఎఒ రామారావు పాల్గొన్నారు. రెంటచింతల మండలం సత్రశాలలోని నాగార్జునసాగర్ టైల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద చిత్రపటానికి ఎస్‌ఈ వెంకటరమణ పూలమాలు వేశారు. మాచర్ల పట్టణంలో శ్రీ రామక్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 122వ వర్ధంతి, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి మంగళశారం నిర్వహించారు. వారి చిత్రపటాలకు రూరల్ సిఐ సమీముల్లా , మున్సిపల్ కమీషనర్ ఇవి రమణబాబు పూలమాలలు వేశారు. సేవా సమితి అధ్యక్షులు ఎం.గోవిందరెడ్డి, నాగూర్‌వలి, పి.పుల్లారావు, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, చినలాల్‌సాహెబ్, జి.నరసింహరావు, మల్లయ్య, చంద్రారావు పాల్గొన్నారు.










