Feb 26,2023 00:04

సీలేరు నదిపై నిర్మించిన ఫ్లోటింగ్‌ జెట్‌ బ్రిడ్జి ఇదే...

ప్రజాశక్తి- మోతుగూడెం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో పొల్లూరు గ్రామంలో సీలేరు నది ఒడ్డు నుంచి ఒడిశా పొల్లూరు వరకు సీలేరు నదిపై తొలిసారిగా ఫ్లోటింగ్‌ జెట్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. 2021లో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒడిశా నుంచి పోల్లూరు జలపాతం వద్దకు జాతర చూడడానికి వీలు కుదరలేదు. అప్పుడు బోటులో భక్తులు ఎక్కువగా రావడంతో నది దాటించలేకపోయారు. సమయం కూడా సరిపోలేదు. ఆ సంఘటనను గుర్తుంచుకొని ఒడిశా గవర్నమెంట్‌ ఫారెస్ట్‌ అధికారులతో మాట్లాడి ఈకో టూరిజం ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ జెట్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేస్నిట్లు మల్కన్‌గిరి డిఎఫ్‌ఓ ప్రతాప్‌ కట్టపల్లి, ఒడిశా ఫారెస్ట్‌ అధికారి దీపక్క సివిలి చెప్పారు. ఈ బ్రిడ్జి మీదకు భక్తులు ఎక్కువ వస్తే ఎలా ఉంటాదో శనివారం పరిశీలించారు. ఫ్లోటింగ్‌ జెట్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని పనితీరును ఒడిశా అధికారులు ఆంధ్ర అధికారులు పరిశీలించారు. ఈ జాతరను గత 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ విధమైన బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో చింతూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం అప్పలనాయుడు, మోతుగూడెం ఎస్‌ఐ వాసంశెట్టి సత్తిబాబు, ఏఎస్‌ఐ పట్టాభి రామయ్య, పంచాయతీ కార్యదర్శి రవి నాయక్‌, జాతర కమిటీ సభ్యులు శిరగం కామేశ్వరరావు, మల్లికార్జున్‌, ప్రసాద్‌, వికాస్‌ పాల్గొన్నారు.