Aug 04,2023 00:27

అరకులోయలో మూతపడ్డ ట్రైబల్‌ మ్యూజియం

ప్రజాశక్తి -యంత్రాంగం
మణిపూర్‌లో ఆదివాసీలపై మతోన్మాద శక్తుల మారణ హౌమాన్ని నిరసిస్తూ ఆదివాసీ, గిరిజన, ప్రజా సంఘాలు, పలు పార్టీలు గురువారం నిర్వహించిన మన్యం బంద్‌ అల్లూరి జిల్లాలో విజయవంతమయ్యింది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు, గిరిజనులు బంద్‌కు స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతును తెలిపారు. జిల్లాలో ఆర్‌టిసి బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. బ్యాంకులు, వర్తక వాణిజ్య సంస్థలు తెరచుకోలేదు. పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి.
అరకులోయ రూరల్‌:పర్యాటక కేంద్రమైన గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్‌, కాఫీ మ్యూజియం, వ్యాపార వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, మణిపూర్‌లో అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదప లేదని విమర్శించారు. అక్కడి సహజ వనరులను బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి మతాల మధ్య చిచ్చుపెట్టి హింసకాండని సృష్టిస్తున్నారన్నారు. చర్చిలు, మసీదులపై దాడి చేసే హక్కు బీజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. మూడు నెలలుగా హింసాకాండ జరుగుతుంటే పోలీసులు దగ్గరుండి సహరించారని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. చర్చీలు, ఇళ్లను తగలబెట్టి వందల కోట్ల ఆస్తులకు నష్టం జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్న్చింఆరు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రధాన పొద్దు బాలదేవ్‌, సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచిపెంట శాంత కుమారి, జెడ్పీటీసీ శెట్టి రోషిని, దండకారణ్య యోచన రాష్ట్ర నాయకులు కొర్ర ప్రసన్న కుమార్‌, జాన్‌ బాబు, రమేష్‌, ఆదివాసి గిరిజన మండల అద్యక్ష కార్యదర్శి పి.రామన్న, బుజ్జిబాబు, హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్యలింగం, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.మహేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్‌ కన్వీనర్‌ దనలక్ష్మి మోహన్‌, కాపీ రైతుల జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చినబాబు, మగ్గన హరి, కోగేష్‌ పాల్గొన్నారు.
పాడేరు:పాడేరులో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనరస మాట్లాడుతూ, మణిపూర్‌లో ఆదివాసీలను చంపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని దుయ్యబట్టారు.దేశవ్యాప్తంగా అటవీ సంపదను ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి అటవీ చట్టాన్ని సవరణ చేశారని విమర్శించారు. ఆదివాసి ప్రాంతాల్లో గిరిజన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్‌, ఉపాధ్యక్షుడు సుందర్‌ రావు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కే రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:అనంతగిరి, చిలకలగెడ్డ పంచాయతీ వెంకయ్యపాలెం, అరకు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు మూతపడింది. కటికి, తాడిగుడ, జలపాతాలు, కాఫీ ప్లాంటేషన్‌, డమ్ముకు సుంకరమెట్ట యు పాయింట్లు మూతపడ్డాయి. ఈ సందర్భంగా జెడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ, మణిపూర్‌లో శాంతి భద్రతలు నెల కొల్పే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు ఎస్‌.నాగులు, జె.సుబ్బారావు, క్రిష్ణ, పుడిగి. దేముడు, రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు
పెదబయలు :మండల కేంద్రంలో జోరు వర్షంలోనూ బంద్‌ విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం పూర్వ అధ్యక్షులు బోండా సన్నిబాబు, ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్‌, నాయకులు కె.శరబన్న, సీతగుంట వైస్‌ సర్పంచ్‌ గంగాధరం, పర్రెడ సర్పంచ్‌ చెండా రవిశంకర్‌ పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ మహిళా సంఘం ఐద్వా వివిధ సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎంఎం శ్రీను, మండల కార్యదర్శి కే నరసయ్య, లక్ష్మీపురం సర్పంచ్‌ కె.త్రినాథ్‌, మండల వైస్‌ ఎంపిపి1 సత్యనారాయణ, సిపిఎం నాయకుడు గాసిరం దొర, వైసీపీ మండల అధ్యక్షుడు మలికర్జాన్‌, కన్వీనర్‌ కొండలరావు, జగబంద్‌, టీడీపీ నాయకులు శాస్త్రీబాబు, పాస్టర్ల సంఘం అధ్యక్షుడు మోహన్‌, పాస్టర్‌ కనక రత్నం, సిపిఎం నేత భీమరాజు, మహిళ సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శి ఈశ్వరి, విజయ, గిరిజన సంఘం నాయకులు శ్రీను, సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకర్‌ పాల్గొన్నారు.
హుకుంపేట:మండలం కేంద్రంలో దుకాణాలు, బ్యాంక్‌లు, విద్యాలయాలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాపుల కృష్ణారావు, డీఎల్‌ఓ వ్యవస్థాపక అధ్యక్షులు చెండా ఏలీయా, సీపీఎం నాయకులు సూడిపల్లి కొండలరావు, ఐద్వా జిలా కార్యదర్శి హైమావతి, పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మండల అధ్యక్షుడు కంబిడి జేమ్స్‌, తడిగిరి సర్పంచ్‌, డీ ఎల్‌ ఓ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాల రంజిత్‌ కుమార్‌, కొంతిలి సర్పంచ్‌ రేగం రమేష్‌, వైస్‌ సర్పంచ్‌ కిల్లో రామారావు, సీపీఎం మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్‌రావు, సీఐటీయూ మండల కార్యదర్శి తమార్బ అప్పల కొండ పడాల్‌, పైనంపాడు వైస్‌ చర్పంచ్‌ కొర్రా తమన్నా, పార్వతీ, కార్పెంటర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీను, శివ పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండల కేంద్రంలో గిరిజన సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి బంధ్‌ జరిగింది. చాపరాయి జలపాతం పూర్తిగా మూతబడింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు, పి కుమారి, మండల నాయకులు పి.సురేష్‌ కుమార్‌, పి.సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షుడు ఎస్‌ గోపాల్‌, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌ గుర్మి సింగ్‌, యానిమెట్ల సంఘం మండల అధ్యక్షుడు పి భాస్కర్‌, రాము ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
పాడేరు: చింతపల్లి మండల కేంద్రంలో హనుమాన్‌ జంక్షన్‌ నుంచి సంతపాకల వరకు ర్యాలీ నిర్వహించారు . అనంతరం హనుమాన్‌ జంక్షన్‌ లో నిరసనను తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో భాషా వాలంటీర్ల సంఘం నాయకులు సర్బు నాయుడు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు, సిపిఎం అల్లూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు . బోనంగి చిన్నయ్య పడాల్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సగ్గే కొండలరావు, మహిళా సంఘం నేత వెంకయ్యమ్మ, టిడిపి అరకు పార్లమెంట్‌ ఇన్చార్జి చల్లంగి జ్ఞానేశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నేత కార్తీక్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు పాల్గొన్నారు.
జి.మాడుగుల:బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు రాంబాబు, సన్యాసి దొర, టిడిపి నేతలు భీంబాబు, గణపతి, హిమాలయ, సిపిఎం నేతలు ధర్మారావు, రామన్న, జనసేన నేతలు భానుప్రసాద్‌, రమేష్‌, ఆదివాసి గిరిజన మహిళ సంఘం మండల అధ్యక్షులు ఎ. శ్రీలత ఈశ్వరమ్మ, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీఐటీయూ మండల కార్యదర్శి దీనబంధు, మహేష్‌, ఆదివాసి మతృభాష సంఘం నాయకులు చిన్నారావు, సుబ్బారావు. రైతునేస్తం ఫౌండేషన్‌ లక్ష్మణ్‌ వెంకట్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి:మణిపూర్‌లో మారణ హోమం వెంటనే ఆపాలని, జీవో నెంబర్‌ 3కు చట్టబద్ధత కల్పించాలని, బోయవాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చరాదని, అటవీ సంరక్షణ చట్ట సవరణను విరమించుకోవాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్త పిలుపు మేరకు మన్యం బంద్‌ రంపచోడవరం ఏజెన్సీలో విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని మానవహారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బందుకు ప్రభుత్వ అధికారులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రాన్ని మరో మాణిపూర్‌ చేయొద్దని, విలువైన అటవీ సంపద మైనింగ్‌ కార్పొరేట్లకు అప్పజెప్పొద్దని హితవుపలికారు. గిరిజనులంతా ఐక్యంగా పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, న్యాయవాది చుక్క సంతోష్‌, పాస్టర్ల పెలోషిప్‌ జిల్లా సెక్రటరీ చంద్రపాల్‌, సీఐటీయూ నాయకులు కె.శాంతిరాజు, కొమరం, చెల్లాయమ్మ పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మారేడుమిల్లి మండలంలో బంద్‌ సందర్భంగా కిరాణ కొట్లు, హోటళ్లు, వివిధ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పలువురు బంద్‌కు మద్దతుగా తమ వాహనాలను నిలిపి వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలు మూతపడ్డాయి. మండల కేంద్రంలో 400 మంది విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో వేటుకూరు సర్పంచ్‌ ఈతపల్లి మల్లేశ్వరి, పలు సంఘాల నాయకులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, ఆవుల ధర్మారెడ్డి, గొర్లె అనిల్‌ ప్రసాద్‌ (బాబి), గొర్లె అనుదీప్‌ కుమార్‌, వీకా రాజన్న దొర, దూడ ప్రణీత్‌, కత్తుల గంగిరెడ్డి, బచేలా చిన్నా రెడ్డి, బి.దాసు, జి.కిషోర్‌, జి.బాబురావు, ఇ.కుమారి, బి.శివ ప్రసాద్‌ రెడ్డి, ఇ.సత్యవతి, బి.ముత్యాల రెడ్డి, వీకా రాజన్న దొర, బట్ట మలిరెడ్డి పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : బందు నేపథ్యంలో రాజవొమ్మంగిలో వర్తక వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో, బైఠాయింపు కార్యక్రమాలు చేపట్టారు. వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, సర్పంచ్‌లు ఆగూరు సుబ్బలక్ష్మి, మిర్యాల గనలక్ష్మి, సత్యవతి, చంద్రుడు ఎంపీటీసీ జి పెద్దిరాజు, గిరిజన సంఘాల నాయకులు కొండ్ల సూరిబాబు, వంతు బాలకృష్ణ, ఈకా శ్రీను, వజ్రపు అప్పారావు, తెడ్ల అబ్బాయి, కుంజం జగన్నాధం, గంపా నాగరాజు రాజు, అప్పారావు, రామరాజు, టి శ్రీను, రామకృష్ణ, ఎస్‌ వీరబాబు, కె రాంబాబు, జిలానీ పాల్గొన్నారు.
అడ్డతీగల : మన్యం బంద్‌ అడ్డతీగలలో విజయవంతమైంది. వర్తక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఏలేశ్వరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు స్వచ్ఛందంగానే నిలుపుదల చేశారు. గోకవరం డిపోకు చెందిన బస్సులను ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు నిలుపుదల చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయింపు చేపట్టారు. ఆదివాసీ గిరజన సంఘాల నాయకులు ఎస్‌ కృష్ణ, ఐ.రమణ పాల్గొన్నారు.
సీలేరు : మన్యం బందులో భాగంగా జీకే వీధి మండల కేంద్రం మెయిన్‌ రోడ్‌లో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. దారకొండ ప్రధాన రహదారిపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాల్లో గాలికొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు, సిపిఎం నాయకులు బాకూరి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు సుంకర విష్ణుమూర్తి, మార్క్‌ రాజు, టిడిపి, కాంగ్రెస్‌, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొయ్యూరు : కొయ్యూరులో జరిగిన బంద్‌కు సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన పార్టీలు మంద్‌కు సంపూర్ణ మద్దతు పలికాయి. మణిపూర్‌లో ఆదివాసీల మీద జరుగుతున్న హింసాకాండను ఆపకపోతే దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదివాసీలు ఐక్యతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఎస్‌.సూరిబాబు, సాగిన బుజ్జిబాబు, గుడి లక్ష్మణ్‌, ఇరువాడ దేవుడు, కనకరాజు, మాకాడ బాలరాజు, చిట్టిబాబు, మేడిపోయిన చిన్న, గంగరాజు పాల్గొన్నారు.
చింతూరు : మణిపూర్‌ సంఘటనకు వ్యతిరేకంగా గురువారం గిరిజన సంఘం, ఐద్వా ఆధ్వర్యాన మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు సీసం సురేష్‌, ఎర్రంశెట్టి శ్రీనివాస్‌, పండ కృష్ణయ్య, ముర్రం రంగమ్మ, మాల్లం సుబ్బమ్మ, పల్లపు వెంకట్‌, రాజయ్య, చిన్నయ్య, లక్ష్మణ్‌ సుబ్బారావు పాల్గొన్నారు.