Oct 31,2023 23:36

ప్రజాశక్తి - ఉండ్రాజవరం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమా నతలు లేని అభివృద్ధి కోసం సిపిఐ (ఎం ) ఆధ్వర్యంలో నవంబర్‌ 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజా రక్షణ భేరికి ప్రజలు భారీగా తరలి రావాలని సిపిఎం తూర్పు గోదావరి జిల్లా నాయకుడు జువ్వల రాంబాబు పిలుపునిచ్చారు. ఈ భేరికి సంబంధించిన కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.జెపి పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. బిజెపి విచ్చన్నకర రాజకీయాలతో, సమైక్యంగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతం, కులం పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో రాష్ట్రంలోని అధికారి వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మోకరిల్లడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మాపు డేనియల్‌, వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.