Jul 17,2023 01:38
విజిట్‌ మజీద్‌లో పాల్గొన్న పెద్దలు

ప్రజాశక్తి-పంగులూరు: మానవులంతా ఒక్కటే అని, ముస్లింలు, హిందువులు కలిసిమెలిసి జీవించాలని, ఇస్లాం గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించా లని అహ్లేహదిస్‌ కమిటీ, నూర్‌బాషా సంఘ పెద్దలు అన్నారు. పంగులూరులో ఆదివారం 'మసీద్‌ సందర్శనకు ఆహ్వానం' (విజిట్‌ మసీద్‌) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూర్‌బాషా సంఘ మతపెద్దలు మాట్లాడుతూ మానవులంతా మతసామరస్య భావాలు పెంపొందించుకోవాలని కోరారు. ఇస్లాం పట్ల, ముస్లింల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. భారతదేశ శ్రేయస్సు కోసం మనందరం ఒకటిగా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అహ్లేహదిస్‌ కమిటీ సభ్యులు అమీర్‌, అహ్మద్‌, ఇస్మాయిల్‌, ఖాదర్‌, మసీద్‌ కమిటీ సభ్యులు కొరిశపాడు సలీం దాయి, నందవరపు పీరు సాహెబ్‌, షేక్‌ సైదా వలి, పోతుగంటి కాసిం సాహెబ్‌, ఆదం సాహెబ్‌, బాబులు, పారుమంచి అసాన్‌, ఉల్లగంటి వలి, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.