Sep 16,2023 21:59

బావిలో తేలియాడిన రామినాయుడు మృతదేహం

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : మండలంలోని బాలగొడబకు చెందిన నల్ల రామినాయుడు (53) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బావిలో పడి మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం గ్రామంలో తేలిఉన్న శవాన్ని పరిశీలించగా, మృతుడు రామినాయుడదని తేలింది. ఆయన స్వస్ధలం బాలగొడబ అయినప్పటికీ భార్య, ఇద్దరు పిల్లలుతో విశాఖలో కూలీపనులు చేస్తూ జీవిస్తున్నాడని, కుటుంబకలతల వల్ల మనస్థాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో శవానికి పంచనామా జరిపించి, పోస్టుమార్టానికి తరలించారు.