పోరుమామిళ్ల/కలసపాడు : ఉపాధ్యాయులు మన స్సాక్షితో పని చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ పేర్కొ న్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా ర్థులను నిలబెట్టి చదువు నేర్పుతున్న ఉపాధ్యాయుడిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ మీ పిల్లలకు ఇదే విధంగా విద్యను నేర్పు తారా.. మన స్సాక్షితో పని చేయండి అన్నారు. బ్లాక్ బోర్డు బదులుగా రైటింగ్ ప్యాడ్‌ను ఉపయోగిస్తున్న ఉపా ధ్యాయునిపై ఆగ్రహించారు. నాడు, నేడు పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎందుకింత ఆల సత్వం వహిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులు, సచి వాలయ సెక్రటరీలు నిద్ర పోతున్నారా అని ప్రశ్ని ంచారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలంటే ప్రక్షాళన చేయాలన్నారు. కింది స్థాయి అధికారులు పనితీరు అదే విధంగా తయారైందని వాపోయారు. 9వ తరగతి విద్యార్థులు ఎందుకు యూనిఫామ్ వేసుకోని రావలేదని ప్రశ్నించగా టైలర్ దగ్గర ఉన్నా యని సమాధానమిచ్చారు. విద్యార్థులకు యూ నిఫాం అందివ్వడంలోనే ఉపాధ్యాయులు అలసత్వం వ్యవ హరించడం తెలుసుకొని వారిపై మండి పడ్డారు. ఆయన వెంట ఆర్‌జెడి వెంకట కష్ణారెడ్డి , సచి వాలయ సెక్రెటరీ రఘురాములు, డిఇఒ రాఘవరెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ అంబవరం ప్రభాకర్ రెడ్డి, ఆర్‌ఐఒ రమణ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
బద్వేల్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో చదువు తున్నటు వంటి వందల మంది ఇంటర్మీ డియట్ విద్యార్థులు ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజులు కట్టలేక అవస్థలకు గురవుతున్నారు.
నాడు నేడు పనులు తనిఖీ
కలసపాడు మండలంలోని బాలుర, బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీ చేశారు. పనులు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నవా ,లేవా, అని పరిశీలించారు. అనంతరం గ్రామాలలోకి వెళ్లి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడిలాంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయా, లేవా ,అని ఆయన ప్రజలను అడిగి తెలు సుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఉపాధ్యాయులు సక్ర మంగా పాఠాలు చెబుతున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా ప్రశ్నిస్తూ వారిలోని సృజన ాత్మకతను వెలికి తీశారు. కార్యక్రమంలో ఎంఇఒ మస్తాన్ వల్లి, హెచ్‌ఎం మెర్సీ మాలిని పాల్గొన్నారు.విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ










