Sep 09,2023 01:26

ప్రజశక్తి - చీరాల
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని ఐకాన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శంకర శెట్టి కొండలరావు అన్నారు. స్థానిక విటల్ నగర్‌లోని చైతన్య మనో వికాస కేంద్రంలో జాతీయ ఫిజియోధెరపి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలువురు ఫిజియోథెరపిస్టులకు ఆయన చేతులమీదగా సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ మానసిక వికలాంగులు శారీరకంగా, మానసికంగా బాగా ఉండేందుకు వారిలో మనోధైర్యాన్ని నింపాలన్నారు. ఫిజియోథెరపిస్ట్ విధానంతో  అనేకమంది దివ్యాంగులకు మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. క్రమం తప్పకుండా మానసిక దివ్యాంగులచే ఫిజియోథెరపీ చేయించాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఎన్‌ వెంకన్నబాబు, ఫిజియోథెరపిస్టులు ఎన్‌ మాధురి,  ప్రసన్న, దివ్య, ఐకాన్ సిబ్బంది పాల్గొన్నారు.