ఈ లోకంలో అంచనాలకందనోడు మనిషి
తరాలెన్నో మారినా నిరంతరం
రంగులుమార్చే
ఊసరవెల్లికంటే
మాయల మరాఠి మనిషి
అనంతమై సాగుతున్న జీవనపోరాటంలో
ఏదోచేయాలనే ఆశతో ఆత్రంగా తన గాత్రాన్ని
సవరించి
పూటకోమాట మార్చి
తననుతానే ఏమార్చుకుని
తన నీడకైనా అంతుచిక్కని తనంతో
ఏ ఎండకాగొడుగు పడుతూ
తన అంతరాత్మను సైతం అయోమయానికి
గురిచేస్తూ
పడమటివైపుకు పయనిస్తున్నడు
ఆశలపల్లకిలో అనునిత్యం ఊగిసలాడుతూ..
ఊరేగుతున్నడు
చైతన్యాన్ని పాతిపెట్టి పొట్టాపతికి
రాతిరికి చేరువైతున్నడు
చీకటికళ్ళతో విర్రవీగుతున్నడు
తన గతస్మృతులను మూసేసి
వర్తమాన చీకట్లలో చిందులేస్తున్నడు
తన దిశల చిరునామా చింపేసి
ఏంతోచని స్థితిలోకి జారుతున్నడు
దిగజారుడుతనమే నైజంగా
సాగుతున్న గమనంలో
తను మనిషినేనని మరచి
మానవ వికాసవనంలో దారి తప్పాడు
- సి. శేఖర్ (సియస్సార్),
9010480557