కడప : నగరంలోని 48 డివిజన్, కపా కాలనీలో ఆదివారం చర్చిలో న్యూ నేటివ్ కపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మ ఆధ్వర్యంలో మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు ఆగి ప్రశాంతత వాతావరణం నెలకొల్పాలని ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను నివారించాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. ఎక్కువగా మహిళలను గౌరవించే భారతదేశంలో ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌంమంత్రి అమిత్ షా లు కుల మతాలకు అతీతంగా ప్రజలందరికు సమానత్వ పాలన అందించే విధంగా కషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పి.రవితేజ, శాంతిరాజు, నరసయ్య, ఏ.అగస్టిన్, సరళ, లక్ష్మి, రోజా, లీలావతి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.










