Jul 28,2023 21:20

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ప్రదర్శనలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తదితరులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా: మణిపూర్‌లో మహిళలపై అమానుష అత్యాచారాలను, ఆకృత్యాలను వెంటనే అరికట్టాలని లౌకికవాదులు, ప్రజా సంఘాలు నరసరావుపేట పట్టణంలో శాంతిర్యాలీ చేశాయి. ర్యాలీకి సంఘీభావంగా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. మణిపూర్‌ హింసాత్మక ఘటనలు ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ మణిపూర్‌లో మారణహో మాన్ని, మహిళలపై అత్యాచారాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, అక్కడ శాంతిని నెలకొల్పాలని కోరారు. ఘటనలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏపీలోని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. కార్యక్ర మంలో ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ చిష్టి, వివిధ సంఘాల నాయకులు డి.శివకుమారి, సిలార్‌ మసూద్‌, మస్తాన్‌ వలి, సయ్యద్‌ హుస్సేన్‌, బి.వెంకట్‌, యు.రంగయ్య, రామకృష్ణ, ఎన్‌.రామా రావు, కె.కృష్ణ, జి.జాన్‌పాల్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఆవాజ్‌ ఆధ్వర్యంలో స్థానిక కళా మందిర్‌ సెంటర్లో మానవహారంగా ఏర్ప డ్డారు. నాయకులు మాట్లాడుతూ కేవలం 28 లక్షల జనాభా గల అతి చిన్న రాష్ట్రమైన మణిపూర్లో శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికా రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని మండిప డ్డారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని మతోన్మాద శక్తుల దాడులు పెరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలని, ప్రజలు శాంతియుతంగా జీవించే పరిస్థి తులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆవాజ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్‌ ఫైరోజ్‌, చిలకలూరిపేట కన్వీనర్‌ నూర్‌అహ్మద్‌, హుదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్‌ఖాన్‌, మాజీ కౌన్సిలర్లు బషీర్‌ మేస్త్రి, అనస్‌ ఖాన్‌, సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, విల్సన్‌, అల్లాబక్షు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదలలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో 3 నెలల నుండి హింసాకాండ జరుగుతుంటుంటే బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం దుర్మాగమైన చర్య అని మండిపడ్డారు. మణిపూర్‌ రాష్ట్రంలో ప్రజల మాన, ప్రాణాలు కోల్పోతున్న కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జి.బాలకృష్ణ జి.జాలయ్య, ఐ.సత్యనారాయణరెడ్డి, ఎం.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, పి.సైదా ఖాన్‌, వెంకట రామయ్య, టి.బ్రహ్మయ్య, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
10న శాంతి ర్యాలి
ప్రజాశక్తి - వినుకొండ : మణిపూర్‌ హింసకు నిరసనగా అఖిలపక్ష సమావేశం స్థానిక యేసయ్యపురంలోని చర్చిలో నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. ఈ ఘటనలకు నిరసనగా ఆగస్టు 10వ తేదీన నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఎంఆర్‌ రోషన్‌ కుమార్‌, జె.బుజ్జిబాబు, కె.డేవిడ్‌, ఎన్‌.సాల్మన్‌రాజు, కె.హనుమంత్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఎ.మారుతి వరప్రసాద్‌, బి.శ్రీను, ఆర్‌కె.నాయుడు, ఆర్‌.ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.