మానవహారం చేస్తున్న అంగన్‌వాడీలు
ప్రజాశక్తి - సాలూరు : మణిపూర్‌లో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు రాధ ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు సంగీత పాఠశాల జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మణిపూర్‌లో మహిళలకు భద్రత కరువైందని, రక్షణ కల్పించాలని కోరారు. శాంతి నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ, వరలక్ష్మి, అరుణ, రమణమ్మ పాల్గొన్నారు.










