మదనపల్లె అర్బన్ : మణిపూర్‌లో జరుగుచున్న దమనకాండ, స్త్రీలపై జరుగుచున్న అత్యా చారాలను అరికట్టి శాంతిభద్రతలను పరిరక్షించాలని ఫాదర్ రెవరెండ్ డాక్టర్ సునీల్ వరకుమార్ పేర్కొన్నారు. మంగళ వారం మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా మదనపల్లి క్రైస్తవ సమాఖ్య ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించి ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. ముందుగా మిషన్ కాంపౌండ్ చిత్తూరు బస్టాండ్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్ సంతగేటు, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి శాంతియుతంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ వరకుమార్ మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు నెలలుగా బలహీన తెగలకు చెందిన వారిపై జరుగుచున్న దాడులను, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తున్నామన్నారు. స్త్రీలని వివస్త్రను చేసి నడివీధులలో ఊరేగించుటను, అధికార అండదండలతో ఒక తెగ మరొక తెగపై బరితెగించి చేయుచున్న దాడులకు పాల్పడడం దురదష్టక రమన్నారు. అనంతరం పాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి భారతపౌరుడికి ఇచ్చిన ప్రాథమిక హక్కులు,ప్రభుత్వ అండదండలతో కాలరాయుట క్షమార్హం కాదన్నారు. వెంటనే జాతీయ మైనారిటీ కమీషను, జాతీయ స్త్రీల హక్కుల కమీషన్ వెంటనే స్పందించాలన్నారు. మణిపూర్ ప్రభుత్వం,పోలీసు శాఖ ఈ దుశ్చర్యలను అడ్డుకొని దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు.










