
ప్రజాశక్తి- కలెక్టరేట్: మణిపూర్‌లో మహిళలు, క్రైస్తవులపై దాడులను అరికట్టి, వారికి రక్షణ కల్పించాలని క్రైస్తవుల సమైక్యత సమాజం, క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.. అనంతరం ఎల్‌ఐసి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ పరిషత్ రాష్ట అధ్యక్షుడు ఈశ్వర్ డానియల్ పాల్, యూత్ అధ్యక్షుడు పి. చిన్న , మహిళా అద్యక్షురాలు ఎన్.నిర్మల, నగర అధ్యక్షుడు ఆర్.విక్టర్ సాల్మన్ రాజు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్: మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుతున్న అత్యాచారాలు, హత్యలను ఖండిస్తూ నర్సీపట్నంలో అఖిలపక్షాల ఆద్వరంలో బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్టా నాగరాజు అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ, మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్న వైఎస్‌ఆర్, తెలుగుదేశం, జనసేన పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తే అది బిజెపికి వేసి నట్టే అవుతుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఈ పార్టీలకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి నెంబర్ మీసాల సుబ్బన్న, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు అడిగర్ల రాజు, ప్రజాబంధు పార్టీ నాయకులు ప్రసాద్, పాల్, ఐద్వా నాయకులు ఎల్.గౌరీ, సూర్య ప్రభ, బహుజన్ ఐక్యవేదిక నాయకులు గంగాధర, రైతు సంఘం నాయకులు మేకా సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కొండలరావు, సూరిబాబు, అప్పలనాయుడు, గిరిబాబు, సూరిబాబు పాల్గొన్నారు.