
నినాదాలు చేపడుతున్న నాయకులు
ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్:మణిపూర్ ఘటనపై విధసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆబీద్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధ నగ ప్రదర్శన మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విదసం జిల్లా నాయకులు ఎల్లాజీ మాట్లాడుతూ, మణిపూర్‌లో ఆర్తనాదాలు మోడీకి వినబడలేదన్నారు. రాష్ట్రపతి స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.పాపారావు, బొట్ట నాగరాజు, అప్పారావు అల్లంపల్లి ఈశ్వరరావు పాల్గొన్నారు.