- రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ప్రజాశక్తి కడప అర్బన్
మణిపూర్‌లో హింసను అరికట్టకపోవడం దారుణమని పలువురు వక్తలు అన్నారు. గురువారం మణిపూర్‌లో హింసను నిరసిస్తూ ప్రెస్ క్లబ్‌లో వల్లూరు మాజీ సర్పంచ్ కిషోర్ కుమార్ అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ, బండి జకరయ్య, సిపిఐ నగర కార్యదర్శి వెంకటశివ, దళిత నాయకులు సీఆర్వీ ప్రసాదరావు, బిసి నాయకులు అవ్వారు మల్లికార్జున, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిఫూర్ రాష్టంలో నెలల తరబడి దమనకాండ జరుగుతున్నా నియంత్రించలేకపోవడం దారుణమని పేర్కొన్నారు. సంఘటనలు చూసి మానవ జన్మ ఎందుకు అనిపిస్తుందన్నారు. అణగారిన వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అస్తుల ధ్వంసం బాధకరమని తెలిపారు. 5వ తరగతి చదువుతున్న బాలికను కన్న తల్లి ఎదుటే అత్యాచారం చెయ్యడం మానవ జాతికే మాయని మచ్చ అన్నారు.పేదల ఇళ్లు, అస్తులను అనేకం ధ్వంసం చేసి అర్దికంగా నష్టం కలిగించారని పేర్కొన్నారు. అనేక సంస్క తులు కలగలిసిన దేశంలో ఇలాంటి దారుణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భిన్న జాతులు కలిగిన దేశంలో అమిత్ షా రాజ్యాంగం అమలవుతుందని తెలిపారు. ప్రపంచాన్ని శాసించే ప్రధాని ఒక చిన్న రాష్టంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను కట్డడి చేయలేకపోయారా అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలన్ని భారతదేశం అంటే అస్యహించుకునే విధంగా ప్రస్తుత పాలన సాగుతుందని విమర్శించారు. ప్రజల్లో బిజేపి పాలనపై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యమన్నారు.










