ప్రజాశక్తి-గుంటూరు : మణిపూర్‌లో హింసాకాండను తక్షణమే నిలుపుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక పాతగుంటూరులోని బిఆర్ స్టేడియం వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ 80 రోజులుగా మణిపూర్‌లో జరుగుతున్న దారుణమైన సంఘటనలపై మోడీ మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. తక్షణమే బాధితులకు అండగా ఉండి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడిలో డబల్ ఇంజిన్ సర్కార్ నాయకుల పాత్ర ఉందనే అనుమానం బలపడుతోందని అన్నారు. అమిత్‌షా పర్యటన తర్వాత హింసా కాండ మరింత పెరగటం బిజెపి కుట్రపూరిత విథానాలకు నిదర్శమని చెప్పారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనా రాయణ, నాయకులు రమేష్‌బాబు, శ్రీనివాస రావు, రమాసుష్మ, అన్నమ్మ పాల్గొన్నారు.
వాచ్‌మెన్ల సంఘం ఆధ్వర్యంలో...
ది గుంటూరు నగర అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నగర అధ్యక్షులు మండూరి వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు నెలలుగా మణిపూర్‌లో అల్లరు జరుగుతుంటే బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్‌ను బంద్ చేశారన్నారు. మణిపూర్‌లో ముష్కరులు రాజ్యమేలుతుంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మహిళలను నగంగా ఊరేగిస్తుంటే అటు ప్రభుత్వానికి కానీ ఇటు పోలీసులకు కానీ పట్టదా అని అన్నారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పి.రాంబాబు, యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు ఆది నికల్సన్, ఎ.సాంబశివరావు, కె.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, వాచ్‌మెన్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : మణిపూర్‌లో బిజెపి మతోన్మాదుల చర్యలకు నిరసనగా ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచిపోయి మృగాల్లాగా మహిళలు ప్రాణాలు తీస్తున్నారని నాయకులు మండిపడ్డారు. కార్యక్రమంలో ఇ.గోపి, జె.చైతన్య, జి.మణి కంఠ పాల్గొన్నారు. నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్, ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బయలుదేరి గౌతమ బుద్ధా రోడ్ మీదుగా రాజీవ్ గహకల్ప రోడ్డు తిరిగి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు చేరారు. ఆర్.వై.దాస్, పి.తిమోతి, కెకె రవికుమార్, కె.చిన్నభూషణం, ఎవిఎస్ మనీ, కె.కరుణానిధి, వి.జాన్‌లూయిస్, కె.రామా రావు, ఎం.సుదీర్, పి.బోయజ్, బి.శివాజీ రాజు, బి.ప్రశాంత్, పీటర్‌పాల్, సంజరు రాజేష్, జెఎంజె సిస్టర్స్, ఎం.రమేష్, సురేష్, జయకుమార్, ఎం.జాన్‌పాల్, ఎన్.విజయ రాజు, జి.రవి కుమార్, మహేష్, జి.శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-దుగ్గిరాల : మణిపూర్‌లో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు పద్మ డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దుగ్గిరాలలో ఆదివారం నిరసన ప్రదర్శన చేయగా పద్మ మాట్లాడుతూ మణిపూర్ అల్లర్లు బిజెపి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ప్రేక్షక పాత్ర సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.గౌరీ, జె.బాలరాజు, వై.స్టాలిన్, వై.బ్రహ్మేశ్వరరావు, ఎన్.యోగేశ్వరరావు, జి.శ్రీనివాస్, ఎం.నాగమల్లేశ్వరరావు, బి.చిరంజీవి, సిహెచ్ పోతురాజు, శ్రీనివాసరావు, ఏసుపాదం, పోలేరమ్మ పాల్గొన్నారు.










